సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నమామ్యహం మానవ
టైటిల్: నమామ్యహం మానవ
పల్లవి:
ప|| నమామ్యహం మానవ సింహం | ప్రమదాంక మహోబల నరసింహం ||
చరణం:చ|| దానవ దైత్య విదారణ సింహం | నానాయుధ కర నరసింహం |
భూ నభోంత రాపూరిత సింహం | ఆనన వహ్ని లయాంతక సింహం ||
చ|| ప్రళయ నృసింహం బహుముఖ సింహం | సలలిత గరుడాచల సింహం |
కులిశ నఖర ముఖ ఘోషిత సింహం | తిలకిత బహురవి దీపిత సింహం ||
చ|| శాంత నృసింహం శౌర్య నృసింహం | సంతత కరుణా జయ సింహం |
కాంత శ్రీ వేంకట గిరి సింహం | చింతిత ఘన సంసిద్ధి నృసింహం ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం