సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నమిత దేవం
టైటిల్: నమిత దేవం
పల్లవి:
ప|| నమిత దేవం భజే నారసింహం | సుముఖ కరుణేక్షణం సులభ నరసింహం ||
చరణం:చ|| విజయ నరసింహం వీర నరసింహం | భుజబల పరాక్రమ స్ఫుట నరసింహం |
రజని చర విదళన విరాజిత నృసింహం | సుజన రక్షక మహాశూర నరసింహం ||
చ|| దారుణ నరసింహం ప్రతాప నరసింహం | చారు కల్యాణ నిశ్చల నృసింహం |
ధీర చిత్తావాస దివ్య నరసింహం | సార యోగానంద చతుర నరసింహం ||
చ|| విమల నరసింహం విక్రమ నృసింహం | కమనీయ గుణగణాకర నృసింహం |
అమిత సుశ్రీ వేంకటాద్రి నరసింహం | రమణీయ భూషాభిరామ నరసింహం ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం