సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నమో నారాయణాయ
పల్లవి:

నమో నారాయణాయ నమః
సమధికానందాయ సర్వేశ్వరాయ ||

చరణం:

ధరణీసతీఘన స్తనశైలపరిరంభ-
పరిమళ శ్రమజల ప్రమదాయ
సరసిజ నివాసినీ సరసప్రణామయుత-
చరణాయతే నమో సకలాత్మకాయ ||

చరణం:

సత్యభామాముఖాంచన పత్రవల్లికా-
నిత్య రచనక్రియా నిపుణాయ
కాత్యాయనీ స్తోత్రకామాయ తే నమో
ప్రత్యక్ష నిజపరబ్రహ్మ రూపాయ ||

చరణం:

దేవతాధిప మకుటదివ్య రత్నాంశుసం-
భావితామల పాదపంకజాయ
కైవల్య కామినీకాంతాయ తే నమో
శ్రీవేంకటాచల శ్రీనివాసాయ ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం