సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నమో నమో దానవవినాశక
టైటిల్: నమో నమో దానవవినాశక
పల్లవి:
ప|| నమో నమో దానవవినాశక చక్రమా | సమర విజయమైన సర్వేశు చక్రమా ||
చరణం:చ|| అట్టె పదారు భుజాల నమరిన చక్రమా | పట్టిన ఆయుధముల బలు చక్రమా |
నెట్టన మూడుగన్నుల నిలచిన చక్రమా | రట్టుగా మన్నించవే మొరయుచు చక్రమా ||
చ|| అరయ నారుగోణాల నమరిన చక్రమా | ధారలు వేయిటి తోడి తగు చక్రమా |
ఆరక మీదికి వెళ్ళే అగ్ని చక్రమా | గారవాన నీదాసుల గావవే చక్రమా ||
చ|| రవిచంద్రకోటి తేజరాసియైన చక్రమా | దివిజ సేవితమైన దివ్య చక్రమా |
తవిలి శ్రీ వేంకటేశు దక్షిణకర చక్రమా | యీవల నీదాసులము యేలుకోవే చక్రమా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం