సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నమో నమో రఘుకుల
టైటిల్: నమో నమో రఘుకుల
పల్లవి:
ప|| నమో నమో రఘుకుల నాయక దివిజవంద్య | నమో నమో శంకర నగజానుత ||
చరణం:చ|| విహిత ధర్మ పాలక వీర దశరథ రామ | గహన వాసిని తాటక మర్దన- |
అహల్యా శాప విమోచన అసురకుల భంజన | సహజ విశ్వామిత్ర సవన రక్షక ||
చ|| హర కోదణ్డ హర సీతాంగనా వల్లభ | ఖర దూషణారి వాలి గర్వాపహ |
ధరణి దనుజాది దనుజుల పాలక | శరధి రంగ కృత్య సౌమిత్రి సమేత ||
చ|| బిరుద రావణ శిరో భేదక విభీషణ వరద | సాకేత పురవాస రాఘవ నిరుపమ |
శ్రీ వేంకట నిలయ-నిజ సకల | పురవర విహార, పుండరీకాక్ష ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం