సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నంద నందన
టైటిల్: నంద నందన
పల్లవి:
ప|| నంద నందన వేణునాద వినోదము- | కుంద కుంద దంతహాస గోవర్ధన ధరా ||
చరణం:చ|| రామ రామ గోవింద రవిచంద్ర లోచన | కామ కామ కలుష వికార విదూరా |
ధామ ధామ విభవత్ప్రతాప రూప దనుజ ని- | ర్ధూమ ధామ కరణ చతుర భవభంజనా ||
చ|| కమల కమలవాస కమలా రమణ దేవో- | త్తమ తమోగుణ సతత విదూర |
ప్రమదత్ప్రమదానుభవ భావ కరణ | సుముఖ సుధానంద శుభరంజనా ||
చ|| పరమ పరాత్పర పరమేశ్వరా | వరద వరదామల వాసుదేవ |
చిర చిర ఘననగ శ్రీవేంకటేశ్వర | నరహరి నామ పన్నగ శయనా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం