సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నరులారా నేడువో
టైటిల్: నరులారా నేడువో
పల్లవి:
ప|| నరులారా నేడువో నారసింహ జయంతి | సురలకు ఆనందమై శుభము లొసగెను ||
చరణం:చ|| సందించి వైశాఖ శుద్ధ చతుర్దశీ శనివార- | మందు సంధ్యాకాలమున ఔభళేశుడు |
పొందుగా కంభములో పొడమి కడప మీద | కందువ గోళ్ళ చించె కనక కశిపుని ||
చ|| నరమృగరూపము నానాహస్తముల | అరిది శంఖచక్రాది ఆయుధాలతో |
గరిమ ప్రహ్లాదుని గాచి రక్షించి నిలిచె | గురుతర బ్రహ్మాండ గుహలోనను ||
చ|| కాంచనపు గద్దెమీద గక్కున కొలువైయుండి | మించుగ ఇందిర తొడమీద బెట్టుక |
అంచె శ్రీవేంకటగిరి ఆదిమ పురుషుండై | వంచనసేయక మంచి వరాలిచ్చీ నిదివో ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం