సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నవరసములదీ
టైటిల్: నవరసములదీ
పల్లవి:
ప|| నవరసములదీ నళినాక్షి | జవకట్టి నీకు జవి సేసీని ||
చరణం:చ|| శృంగార రసము చెలియ మొకంబున | సంగతి వీరరసము గోళ్ళ |
రంగగు కరుణరసము పెదవులను | అంగపు గుచముల నద్భుత రసము ||
చ|| చెలి హాస్యరసము చెలవుల నిండీ | పలుచని నడుమున భయరసము |
కలికి వాడుగన్నుల భీభత్సము | అల బొమ జంకెనల నదె రౌద్రంబు ||
చ|| రతి మరపుల శాంతరసంబదె | అతి మోహము పదియవరసము |
ఇత్వుగ శ్రీవేంకటేశ కూడితివి సతమై యీపెకు సంతోస రసము ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం