సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నవరూప ప్రహ్లాద
టైటిల్: నవరూప ప్రహ్లాద
పల్లవి:
ప|| నవరూప ప్రహ్లాద నరసింహ | అవిరళతేజ ప్రహ్లాద నరసింహ ||
చరణం:చ|| పగరపై కోపము బంటుజూచి మరచితి | నగుమొగము ప్రహ్లాదనరసింహ |
ఎగువ నీకోపము కితడే మాటుమందు | అగుపడె మాకును ప్రహ్లాదనరసింహ ||
చ|| అంట ముట్టరాని కోపము అంగనజూచి మానితి- | నంటు చెల్లు ప్రహ్లాద నరసింహ |
జంటి నీబుద్ధి తిప్ప సతియె అంకుశము | అంటువాయ మికను ప్రహ్లాదనరసింహ ||
చ|| ధర మొరవెట్ట దేవతలే మొక్కితే మానితి | గరుడాద్రి ప్రహ్లాదనరసింహ |
ఇరవై శ్రీవేంకటాద్రి నిందు అందు నీదె సుద్ధి | అరసితి మిదివో ప్రహ్లాదనరసింహ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం