సంకీర్తన
రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: ఒక్కమాటు శరణని వుండేనింతేగాక
టైటిల్: ఒక్కమాటు శరణని వుండేనింతేగాక
పల్లవి:
ఒక్కమాటు శరణని వుండేనింతేగాక
పెక్కువిధముల నెట్టు పెనగేనయ్యా |ఒక్కమాటు|
నాలికే ఒక్కటే నీ నామముల లనంతము
పోలించి నేనిన్నెట్టు పొగడేదయ్యా |2|
వోలి నాకన్నులు రెండే వొగి నీమూర్తులు పెక్కు |2|
సోలి నే నిన్నెటువలె జూచెదనయ్యా |ఒక్కమాటు|
పట్ట నాచేతులు రెండే పదములు నీకు బెక్కు
వొట్టి నిన్ను బూజించ నోపికేదయ్యా |2|
గట్టి నాచెవు లిసుమంత కథలు నీ కవియెన్నో
పట్టవు నేనెట్టు విని భజయించేనయ్య |2| |ఒక్కమాటు|
యేమిటా జిక్కవు నీవు యింతదేవుడవుగాద
కామించి నీడాగు మోచి గతిగనేను
యీమేర శ్రీవేంకటేశ నీవే నన్నుగావు |2|
దీమసాన నిక వేరెతెరువు లేదయ్యా |2| |ఒక్కమాటు|
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం