సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పాడరే సోబనాలు
టైటిల్: పాడరే సోబనాలు
పల్లవి:
ప|| పాడరే సోబనాలు పడతులారా | వేడుక లిద్దరిని వెలసెజూడరే ||
చరణం:చ|| కొండలే పీటలుగా కూచున్నారెదురుబడి | అండనే నారసింహుడు ఆదిలక్ష్మియు |
వెండిపైడి నిండుకొన్న వేదాద్రి గరుడాద్రుల | పెండిలాడే రిద్దరును ప్రియమున చూడరే ||
చ|| భవనాశిజలముల పాయక తోడనీళ్ళాడిరి | ఇవలా నవలా తాము ఏటిదరుల |
జవళి మంచిపూవుల సరిసేసలు వెట్టుచు | తవిలి సుముహూర్తాన తప్పక చూచేరు ||
చ|| పొందుగ కనకావతి భోగవతి నదుల | సందడి వసంతముగా జల్లులాడుచు |
అందమై శ్రీవేంకటాద్రి అహోబలాన ఒక | చందమున కూడి సరసములాడేరు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం