సంకీర్తన

రచయిత: తాళ్ళపాక అన్నమాచార్య
టైటిల్: పాలదొంగవద్ద
పల్లవి:

పాలదొంగవద్ద వచ్చి పాడేరు తమ
పాలిటిదైవమని బ్రహ్మాదులు

చరణం:

రోల గట్టించుక పెద్దరోలలుగా వాపోవు
బాలునిముందర వచ్చి పాడేరు
ఆలకించి వినుమని యంబరభాగమునందు
నాలుగుదిక్కులనుండి నారదాదులు

చరణం:

నోరునిండా జొల్లుగార నూగి ధూళిమేనితో
పారేటిబిడ్డనివద్ద బాడేరు
వేరులేనివేదములు వెంటవెంట జదువుచు
జేరిచేరి యింతనంత శేషాదులు

చరణం:

ముద్దులు మోమునగార మూలలమూలలదాగె
బద్దులబాలునువద్ద బాడేరు
అద్దివో శ్రీతిరువేంకటాద్రీశు డితడని
చద్దికి వేడికి వచ్చి సనకాదులు

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం