సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పాపినైన నాపాల
టైటిల్: పాపినైన నాపాల
పల్లవి:
ప|| పాపినైన నాపాల గలిగితోవ | చూపుమన్న నెందు జూపరు ||
చరణం:చ|| ధృతిదూలి జగమెల్ల దిరిగి వేసరితి | యితరాలయముల కేగియేగి వేసరితి |
గతిమాలి పరులపై గనలి వేసరితి | మతిమాలి కులవిద్య మాని వేసరితి ||
చ|| విసిగి యాచారంబు విడిచి వేసరితి | పసచెడి ప్రియములు పలికి వేసరితి |
కొసరి ద్రవ్యముపై గోరి వేసరితి | మతిమాలి కులవిద్య మాని వేసరితి ||
చ|| కోవిదులగువారి గొలిచి వేసరితి | దైవములందరి దడవి వేసరితి |
శ్రీవేంకటేశునిసేవ మాని వట్టి- | సేవలన్నియు నేజేసి వేసరితి ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం