సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పాపమెరంగని
టైటిల్: పాపమెరంగని
పల్లవి:
ప|| పాపమెరంగని బ్రాహ్మడు యెందు | జూపరానిచోటు చూపీనయ్యా ||
చరణం:చ|| తనివోక జీవముతలకాయ నంజుడు | పనివడి తిని తిన్నబ్రాహ్మడు |
యెనసి యెదిరి దన్నునెరగక విభుడై | ఘనవంశము మంట గలపీనయ్యా ||
చ|| ఎవ్వారు నెరగనియెముకల యింటిలో | పవ్వళించుచున్న బ్రాహ్మడు |
జవ్వనమదమున జడిసేటికోమలి | బువ్వులతోటలో బొదిగీనయ్యా ||
చ|| చెలగి కన్నెరికము చెడనిపడచు దెచ్చి | పలువేదనల బెట్టేబ్రాహ్మడు |
తెలసి వేంకటాధిపుని దాసుడై | పులుగు పంజరాన బొదిగీనయ్యా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం