సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పాపములే సంబళమెపుడూ
టైటిల్: పాపములే సంబళమెపుడూ
పల్లవి:
ప|| పాపములే సంబళమెపుడూ యీ- | యాపదబడి నే నలవనా ||
చరణం:చ|| ఎన్నిపురాణము లెటువలె విన్నా | మన్నమనువు దిమ్మరితనమే |
నన్ను నేనే కానగలేనట నా- | విన్నవినుకులకు వెఱచేనా ||
చ|| యెందరుపెద్దల నెట్ల గొలిచినా | నిందల నామతి నిలిచీనా |
కందువెఱిగి చీకటికి దొలగనట | అందపుబరమిక నందేనా ||
చ|| తిరువేంకటగిరి దేవుడే పరమని | దరిగని తెలివిక దాగీనా |
తిరముగ నిను జింతించినచింతే | నిరతము ముక్తికి నిధిగాదా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం