సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పాపపుణ్యముల పక్వ
టైటిల్: పాపపుణ్యముల పక్వ
పల్లవి:
పాపపుణ్యముల పక్వ మిదెరుగను
నా పాలిటి హరి నమో నమో ||
మానస వాచక కర్మంబుల
తానకముగ నీ దాసుడను
పూని త్రిసంధ్యల భోగ భాగ్యముల
నానా గతులను నమో నమో ||
వలనుగ జాగ్రద్స్వప్న సుషుప్తుల
ఇలలో నీకే హితభటుడ
వెలుపల లోపల వేళావేళల
నలినాక్ష నీకె నమో నమో ||
పుట్టుక తొలుతను పుట్టిన మీదట
అట్టె నీ శరణాగతుడ
గట్టిగ శ్రీ వేంకటపై నీకృప
నట్ట నడుమైతి నమో నమో ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం