సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పాయక మతినుండి
టైటిల్: పాయక మతినుండి
పల్లవి:
ప|| పాయక మతినుండి పరగ మేలుగీడును | సేయించి కర్మి దాజేయుటెవ్వరిది ||
చరణం:చ|| వెలయ జరాచరవిభుడైన విభునాత్మ | దలచుగాక ప్రాణి దానేమి సేయు |
తెలిసి నిర్మలభక్తి దీవించి తనుజేర | గొలిపించుకొనలేమి కొరత యెవ్వరిది ||
చ|| కొందరు సుఖులై కొదలేక మెలగగ | కొందరిదుఃఖపుకొరత యెవ్వరిది |
అందరిమతి వేంకటాద్రివల్లభ నీవు | చెంది కర్మముల జేయుచేత యెవ్వరిది ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం