సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పాయని కర్మంబులె
టైటిల్: పాయని కర్మంబులె
పల్లవి:
ప|| పాయని కర్మంబులె కడుబలవంతము లనినప్పుడె | కాయమునకు జీవునకును గర్తృత్వము లేదు ||
చరణం:చ|| ఆతుమ సకలవ్యాపకమని తలపోసినపిమ్మట | జాతియు గులాభిమానము జర్చింపనెరాదు |
భూతవికారములన్నియు బురుషోత్తము డనినప్పుడు | పాతకములపుణ్యంబులపని తనకే లేదు ||
చ|| పదిలంబుగ సర్వాత్మభావము దలచినపిమ్మట | ముదమున నెవ్వరి జూచిన మొక్కకపోరాదు |
కదిసినయిప్పటిసుఖమువలె కడుదుఃఖములని తెలిసిన | చెదరక సంసారమునకు జేసాపనెరాదు ||
చ|| పరిపూర్ణుడు తిరువేంకటపతియనగా వినినప్పుడు | యెరవులహీనాధికములు యెగ్గులు మరి లేవు |
పరమాత్ముండగునీతనిభక్తులం దలచినయప్పుడు | తిరముగ నీతనికంటెను దేవుడు మరి లేడు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం