సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పాయపుమదములబంధమా
టైటిల్: పాయపుమదములబంధమా
పల్లవి:
ప|| పాయపుమదములబంధమా మము | జీయని యిక గృపసేయగదో ||
చరణం:చ|| ధనధాన్యములై తనులంపటమై | పనిగొంటివి నను బంధమా |
దినదినంబు నునుతీదీపుల బెను- | గనివైతివి యిక గావగదో ||
చ|| సతులై సుతులై చలమై కులమై | పతివైతివి వోబంధమా |
రతి బెరరేపుల రంతులయేపుల | గతిమాలితివిక గావగదో ||
చ|| పంటై పాడై బలుసంపదలై | బంటుగ నేలితి బంధమా |
కంటిమిదివో వేంకటగిరిపై మా- | వెంటరాక తెగి విడువగదో ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం