సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పెద్దలు మీరంతేసి
టైటిల్: పెద్దలు మీరంతేసి
పల్లవి:
ప|| పెద్దలు మీరంతేసి పెనగనేల | వుద్దండవు నీ చేతలు వుట్టిబెట్టవయ్యా ||
చరణం:చ|| మోవిపండు గానుకిచ్చె మొక్కె నీకు జేతులను | సేవలింకా నేమి యాపె సేసునయ్యా |
కావిరించి దగ్గరితే కాలుదాకు జేయిదాకు | దేవరవంటి నీ కంతేసి తగదయ్యా ||
చ|| గోరంట పూవంది ఇచ్చె కొలువున నిలుచుండె | పేరి యిచ్చకము లేమి పెంచునయ్యా |
వేరె మాటలాడబోతే వెంగమౌనో వెగటౌనో | ఆరీతి దొరవు నీకవి చెల్లవయ్యా ||
చ|| ఆరతిచ్చె నానాంగాల నన్నిటికి సమ్మతించె | కూరిమి నిన్నెట్లాను కొసరునయ్యా |
యీరీతి శ్రీ వేంకటేశ యింపు లేదో సొంపులేదో | ఆరితేరినట్టి నీకు ఆస మానదయ్యా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం