సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పేరంటాండ్లు పాడరే
టైటిల్: పేరంటాండ్లు పాడరే
పల్లవి:
ప|| పేరంటాండ్లు పాడరే పెండ్లివేళ | సారెసారె నిద్దరికి సంతోషవేళ ||
చరణం:చ|| చిత్తజు తల్లికి వేగ సింగారించరె మీరు | తత్తరించేరిది ముహూర్తపువేళ |
హత్తి తలబాలు నారాయణుని బోయమనరే | పొత్తుల నిద్దరికిని బువ్వపువేళ ||
చ|| పాలవెల్లి కూతురుకు పసపుల నలచరే | చాలించరేజోలి వీడుచదివే వేళ |
పాలుపడీ పరపులు పరచరే దేవునికి | నాలుగోదినము నేడూ నాగవల్లి వేళ ||
చ|| అంది బాగాలియ్యరే అలుమేలుమంగకును | కందువ శ్రీ వేంకటేశుగలసే వేళ |
గందము గస్తూరి నీరె ఘనరతినలరసరి- | కుండకీ యిద్దరు నికగొలువుండేవేళ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం