సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పెట్టిననీ వెఱుగుదు
టైటిల్: పెట్టిననీ వెఱుగుదు
పల్లవి:
ప|| పెట్టిననీ వెఱుగుదు పెనుదిక్కు | జట్టిగా శ్రీహరి నీకు శరణు చొచ్చితిమి ||
చరణం:చ|| కర్మమూలమైనట్టికాయము మోచి నేను | కర్మము విడువబోతే కడుసంగతా |
మర్మమెఱిగిననీవే మాయల గట్టుండగాను | పేర్మి నే విడువబోతే బిగియదా కట్టు ||
చ|| బంధమూలమైనట్టిప్రపంచమందు నుండి | బంధము బాసేనంటే బాసునా అది |
అంధకారమైనట్టి అజ్ఞానాన దోసితివి | అంధకారమున వెలు గరసితే గలదా ||
చ|| నిచ్చలు నీసంసారపునీరధిలోన మునిగి | చొచ్చి వెళ్ళి చేరేనంటే జోటు గలదా |
యిచ్చట శ్రీవేంకటేశ యిహమందే పరమిచ్చి | అచ్చు మోపి యేలగా నే నన్నియు దెలిసితి ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం