సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పిడికిట తలంబ్రాల
పల్లవి:

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత |
పెడమరలి నవ్వీనె పెండ్లి కూతురు ||

చరణం:

పేరుకల జవరాలె పెండ్లి కూతురు పెద్ద |
పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు |
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు |
పేరుకుచ్చ సిగ్గువడీ బెండ్లి కూతురు ||

చరణం:

బిరుదు పెండము వెట్టె బెండ్లి కూతురు నెర |
బిరుదు మగని కంటె బెండ్లి కూతురు |
పిరిదూరి నప్పుడే పెండ్లి కూతురూ పతి |
బెరరేచీ నిదివో పెండ్లి కూతురు ||

చరణం:

పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడె |
పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు |
గట్టిగ వేంకటపతి కౌగిటను |
పెట్టిన నిధానమయిన పెండ్లి కూతురు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం