సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పండియు బండదు
టైటిల్: పండియు బండదు
పల్లవి:
ప|| పండియు బండదు చిత్తము పరిభవ మెడయదు కాంక్షల | యెండలచే కాగితి మిక నేలాగోకాని ||
చరణం:చ|| పదిగోట్ల జన్మంబుల బాయనికర్మపుబాట్లు | వదలక వొకనిమిషములో వడి దీరుచు నితడు |
చెదరని నిజదాసులకును శ్రీహరి, మాకిపుడంతక | హృదయము నిలువదు చంచల మేలాగోకాని ||
చ|| కూపపుబహునరకంబుల కోట్లసంఖ్యల బొరలేటి- | పాపము లొకనుమిషములో బాపగగల డితడు |
కాపాడగ దలచిన యీకమలాపతి, నేమీతని- | యేపున గని మనలేమిక నేలాగోకాని ||
చ|| జడిగొని యెన్నడు బాయని సంసారపు బంధంబుల | విడుమని వొకనిమిషములో విడిపించును యితడు |
కడుగొలిచినవారికి వేంకటపతి, నేమీతని- | నెడయక కొలువగలేమిక నేలాగోకాని ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం