సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పనిలేనిధనవాంఛ
టైటిల్: పనిలేనిధనవాంఛ
పల్లవి:
ప|| పనిలేనిధనవాంఛ బడిపొరలిన నిట్టి- | కనుమాయలేకాక కడ నేమిగలదు ||
చరణం:చ|| కనుచూపుకాకల గలయట వెడయాస- | లనుభవింపుటగాక యందేమిగలదు |
తనువల్లిసోకుల దగులుట మమతల- | నెనయగోరుటగాక యిందేమిగలదు ||
చ|| ఎలమి నధర మానుటెరిగి యెంగిలి నోర- | నలుముకొనుట గాక యందేమిగలదు |
పలులంపటములచే బడుట దుఃఖంబులు | తలజుట్టుటేకాక తనకేమి గలదు ||
చ|| శ్రీవేంకటాద్రీశు జేరనిపనులెల్ల | నేవగింతలేకాక యిందేమిగలదు |
ఆవల సురతభోగ మనుభవింపబోయి | రావలయుటగాక రచనేమిగలదు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం