సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పనిమాలినట్టి
టైటిల్: పనిమాలినట్టి
పల్లవి:
ప|| పనిమాలినట్టి వట్టిపరదుగాక మాకు | ననిచి యిదియు నొక్కనగుబాటా ||
చరణం:చ|| కన్నవారినెల్లా వేడేకష్టమే దక్కుటగాక | పన్ని దైవమియ్యనిది పరులిచ్చేరా |
యెన్నికతో దేహమిచ్చె నిహమెల్లా జెందనిచ్చె | వున్నవారింతటిపని కోపగలరా ||
చ|| బడలి తానెందైనా బడ్డపాటేదక్కెగాక | కడగి రానిదిదే నొక్కరివసమా |
కడుపులో నుండగానే కలవి నుదుట వ్రాసె | తడవి దైవముచేత దాటవసమా ||
చ|| దెప్పరపుసంపదకు దిమ్మటలే దక్కెగాక | యెప్పుడూ శ్రీవేంకటేశు డీకమానీనా |
చప్పుడుగా నతనికే శరణన్న జాలుగాక | తప్పులును వొప్పులు నాతనివేకావా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం