సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పనివడి యింద్రియాలే
టైటిల్: పనివడి యింద్రియాలే
పల్లవి:
ప|| పనివడి యింద్రియాలే పరువులు వెట్టుగానీ | ఎడయని చుట్టరికాలెవ్వరికీ లేవు ||
చరణం:చ|| వన్నె సతుల రూపులు వారివద్దనె నుండగా | కన్నులజూచే వారికి కళరేగును |
ఎన్నివారి గుణాలెడ మాటలాడగాను | విన్నవారికి వూరకేను వేడుకలుబుట్టు ||
చ|| అంతానింతా గమ్మవిరులు అంగళ్ళలో నుండగా | సంత వారలూరకే వాసనగొందురు |
బంతివారి కంచాలలో పలురుచు లుండగాను | వింతవార లందుకుగా వెసనోరుదురు ||
చ|| వెరవిడి దేహాలు వేరె వుండగాను | సురతాన సోకితేనే చొక్కుదురు |
ఇరవై శ్రీ వేంకటేశు యిన్నిటికీ సూత్రధారి | నరినితనీ దాసులు జడియరిందుకును ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం