సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పంకజాక్షులు సొలసిపలికి
టైటిల్: పంకజాక్షులు సొలసిపలికి
పల్లవి:
ప|| పంకజాక్షులు సొలసిపలికి నగగా- | నింకా నారగించు మిట్లనే అయ్యా ||
చరణం:చ|| కలవంటకములు పులుగములు దుగ్ధాన్నములు | పలుదెరగులైన అప్పములగములు |
నెలకొన్ననేతులును నిరతంపుచక్కెరలు | గిలుకొట్టుచును నారగించవయ్యా ||
చ|| పెక్కువగు సైదంపు పిండివంటలమీద | పిక్కిటిలు మెఱుగుబొడి బెల్లమును |
వొక్కటిగ గలుపుకొని వొలుపుబప్పులతోడ | కిక్కిరియ నిటు లారగించవయ్యా ||
చ|| కడుమధురమైన మీగడపెరుగులను మంచి- | అడియాల వూరుగాయల రుచులతో |
బడిబడిగ నవకంపు బళ్ళెరంబులతోడ | కడునారగించు వేంకటగిరీంద్రా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం