సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పంతగాడు మిక్కిలి
టైటిల్: పంతగాడు మిక్కిలి
పల్లవి:
పంతగాడు మిక్కిలి నీ పవనజుడు రంతుకెక్కె మతంగ పర్వత పవనజుడు
చరణం:వాలాయమై ఎంత భాగ్యవంతుడో దేవతలచే బాలుడై వరములందె పవనజుడు
పాలజలనిధి దాటి పరగ సంజీవి దెచ్చి ఏలిక ముందర బెట్టే ఈ పవనజుడు
సొంటులు శోధించిదెచ్చె సుగ్రీవుడు రాఘవునికి బంటుగాగ పొందు సేసె పవనజుడు
ఒంటినె రాముని ముద్ర ఒసగి సీత ముందర మింటి పొడవై పెరిగే మేటి పవనజుడు
ఇట్టి శ్రీ వేంకటేశ్వరు కృపచే ముందరి బ్రహ్మ పట్టమేల నున్నవాడు పవనజుడు
చుట్టి చుట్టి తనకు దాసులైన వారికి గట్టి వరములిచ్చే నీ ఘన పవనజుడు
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం