సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పొడవైన శేషగిరి
టైటిల్: పొడవైన శేషగిరి
పల్లవి:
ప|| పొడవైన శేషగిరి బోయనాయడు | విడువ కిందరి గాచు వెడబోయనాయడు ||
చరణం:చ|| పొలసి మీసాల పెద్దబోయనాయడు | మలిగి వీపునగట్టేమంకుబోయనాయడు |
పొలమురాజై తిరిగేబోయనాయడు | వెలయ మోటుననుండేవేటబోయనాయడు ||
చ|| పొట్టిపొట్టియడుగులబోయనాయడు యెందు | బుట్టుపగసాధించేబోయనాయడు |
బొట్టులమెకమునే సేబోయనాయడు | పట్టపునెమలిచంగుబలుబోయనాయడు ||
చ|| పొంచి శిగ్గెగ్గెఱగనిబోయనాయడు | మించి రాలమీదదాటేమెండుబోయనాయడు |
అంచెల శ్రీవేంకటేశుడనేబోయనాయడు | పంచ గాలవేలములబలుబోయనాయడు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం