సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పోరాక పోయి
టైటిల్: పోరాక పోయి
పల్లవి:
ప|| పోరాక పోయి తలపుననున్నదైవంబు | జేరనొల్లక పరుల జేరదిరిగెదము ||
చరణం:చ|| వడిబారుపెనుమృగము వలలలోపల దగులు- | వడి వెడల గతిలేక వడకుచున్నట్లు |
చెడనికర్మములులలో జిక్కి భవములబాధ | బడియెదముగాక యేపనికి దిరిగెదము ||
చ|| నీరులోపలిమీను నిగిడి యామిషముకై | కోరి గాలము మ్రింగి కూలబడినట్లు |
జారిపోయిననేల సంసారసౌఖ్యవి- | కారంపుమోహముల గట్టువడియెదము ||
చ|| శ్రీవేంకటేశు నాశ్రితలోకరక్షకుని | భావింప దేవతాపతియైనవాని |
సేవించుభావంబు చిత్తమెడబడక నే- | మీవలావలిపనుల నిట్ల దిరిగెదము ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం