సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పోయం గాలము
టైటిల్: పోయం గాలము
పల్లవి:
ప|| పోయం గాలము వృథయై పుట్టినమొదలుం గటకట | నీయెడ నామది నిజమై నిలుచుట యెన్నడొకో ||
చరణం:చ|| కుడిచిన నాకలి దీరదు కుడువగగుడువగ బైపై | కడుబొదలెడుదీపన మిది గడచుట యికనెట్లు |
కుడువకమానుట యెన్నడు కోరికదీరుట యెన్నడు | తడయక నీరూపము నే దలచుట లెన్నడొకో ||
చ|| జీవుడుపుట్టిన మొదలును జేతికి నూఱట చాలక | యేవిధమున భుజియించిన నెడయదు దీపనము |
శ్రీవేంకటపతి నాకిక శ్రీకరుణామృత మియ్యక | పావనమందదు నామది పాలించందగదా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం