సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పొరి నీకును
టైటిల్: పొరి నీకును
పల్లవి:
ప|| పొరి నీకును విరిగి పోయిన దానవులు | బిరుదులుడిగి వోడ బేహారులైరి ||
చరణం:చ|| మకుటాలుతీసి జటామకుటాలు గట్టుకొని | వెకలిరిపులు ముని వేషులైరి |
మొకములను సోమపు మొకములు పెట్టుకొని | అకటా కొందరు రిపులాట వారైరి ||
చ|| పేరులు విడిచి సంకుబేరులు మెడవేసుక | సారెకు కొందరు శివ సత్తులైరి |
బీరపు సాములు మాని పెద్దగడ సామునేర్చి | తోరపు బగతులెల్ల దొమ్మరులైరి ||
చ|| నాదించ వెరచి సింగి నాదాలూదు కొంటాను | సోదించేరటాగొందరు జోగులైరి |
ఈదెస శ్రీ వేంకటేశ యున్నియు మానికొందరు | దాదాతని శరణనీ దాసులైరి ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం