సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పొత్తుల మగడవు
టైటిల్: పొత్తుల మగడవు
పల్లవి:
ప|| పొత్తుల మగడవు పొరుగున నుండగ | తత్తరమింతేసి తమకేలనయ్యా ||
చరణం:చ|| యేపున నీమోము యిటు నేజూచిన | చూపు లాపెమై చురకనెను |
ఆపొద్దు నీతో నాడిన మాటల | తీపులు దనకటు తిన జేదాయ ||
చ|| నడుమ నే నీతో నవ్విన వెన్నెల | కడనాపెకు జీకటులాయ |
చిడుముడు నే నిను జెనకిన సరసము | వెడ వెడ దనకవి విరసములాయ ||
చ|| వెస నా మోవులవిందు నీకిడిన | వసిగొని నాపెకు బగలాయ |
యెసగిన శ్రీ వేంకటేశు మమ్మిద్దరి | గొసరికూడితివి గురి దనకాయ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం