సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పరదేశిపట్టణమున
టైటిల్: పరదేశిపట్టణమున
పల్లవి:
ప|| పరదేశిపట్టణమున పదుగురునేగురు గూడుక | పరగగ వరి చెడ నూదర బలిసినయట్లాయ ||
చరణం:చ|| ఊరేలెడియత డలసత నూరకయుండగ నడుమల- | వారలు నిక్కపుగర్తలవలె నుండినగతిని |
ధీరత చెడి తను జీవుడు దెలియగనేరక యుండిన | ధారుణిలోపల దొంగల ధర్మాసనమాయ ||
చ|| వొడలంతంతకు జిక్కగ నుబ్బినరోగము సుఖమున- | కెడమియ్యక నానాటికి నేచినచందమున |
తడబడువిజ్ఞానము గతిదప్పగ బలుపగుపట్నము | కడుజెడగా మాలవాడ్ ఘన్మైనట్లాయ ||
చ|| పొసగగ నిది గని యధికుడు పుక్కటకాండ్ల నందరి | బసమారిచి మొదలికర్త బాలించినగతిని |
పసగలతిరువేంకటగిరిపతి నాదేహపుబురి నీ- | వసమై వెన్నుకు బండ్లు వచ్చినయట్లాయ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం