సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పరగీ నిదివో
టైటిల్: పరగీ నిదివో
పల్లవి:
ప|| పరగీ నిదివో గద్దెపై సింహము వాడె | పరమైన ఔభళనారసింహము ||
చరణం:చ|| తెల్లనిమేనిసింహము దేవసింహము | మెల్లని చిరునవ్వుల మేటిసింహము |
చల్లేటి ఉరుపులతో జయసింహము వాడె | బల్లిదుడైవెలసే ఔభళనారసింహము ||
చ|| నిలుచున్న సింహము నిత్య సింహము | అలరు కొండలమీది అది సింహము |
వెలుపలి కడపపై వీరసింహము | పలుకు పంతముల ఔభళనారసింహము ||
చ|| పుట్ట జడల సింహము పూర్ణసింహము | ఱట్టడి ఆర్పుల ఆఱడి సింహము |
జట్టిగొన్న దాసులకు శాంతసింహము | పట్టపు శ్రీవేంకట ఔభళనారసింహము ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం