సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పరగుబహుజన్మ
టైటిల్: పరగుబహుజన్మ
పల్లవి:
ప|| పరగుబహుజన్మ పరిపక్వహృదయుడై | మరికదా వేదాంతమార్గంబు గనుట ||
చరణం:చ|| కలుషహరమగు వివేకమ్ము గలిగినయట్టి- | ఫలముగాదా కృపాపారీణుడౌట |
తలపోసి సకలభూతదయావిశేషంబు | కలిగికదా గుణవికారంబు గనుట ||
చ|| యెదిరి దనవలెనె తా నెఱగనేర్చినఫలము | అదిగదా ద్రవ్యమోహంబు గడచనుట |
పదిలమగునాశానుభవము పాపినయట్టి- | తుదగదా తాను సంతోషంబు గనుట ||
చ|| రతిపరాఙ్ముఖ మహారాజ్యమబ్బినఫలము | మతిగదా తాను కర్మత్యాగియౌట |
తతితోడ ఫలపరిత్యాగిచిత్తవ్యాపి- | ధృతిగదా వేంకటాధిపుదాసుడౌట ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం