సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పరిపూర్ణగరుడాద్రి
టైటిల్: పరిపూర్ణగరుడాద్రి
పల్లవి:
ప|| పరిపూర్ణగరుడాద్రిపంచాననం | పరమం సేవే పంచాననం ||
చరణం:చ|| కౄరదంష్ట్రాగ్నికణఘోరపంచాననం | పారీణచక్రధర పంచాననం |
వీరపంచాననం విజయపంచాననం | భారభూభారహరపంచాననం ||
చ|| దివిజపంచాననం తీవ్రనఖకాననం | భవనాశినీతీరపంచాననం |
కువలయాకాశసంఘోషపంచాననం | పవిశబ్దదంతరవపంచాననం ||
చ| శ్రీవేంకటాఖ్య ఘనశిఖరిపంచాననం | పావనం పంచముఖపంచాననం |
సేవితప్రహ్లాదసిద్ధిపంచాననం | భావితం శ్రీయుక్తపంచాననం ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం