సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పరమాత్మ నిన్నుగొల్చి
టైటిల్: పరమాత్మ నిన్నుగొల్చి
పల్లవి:
ప|| పరమాత్మ నిన్నుగొల్చి బ్రతికేము | విరసపు జాలివెత బడనోపము ||
చరణం:చ|| మగడు విడిచినా మామ విడువని యట్లు | నిది నా మనసు రోసినా లోకులు మానరు |
తగిలేరు పొగిలేరు దైన్యమే చూపేరు | మొగమోటాలను నేను మోసపోవ నోపను ||
చ|| పొసగ దేవుడిచ్చినా పూజారి వరమీడు | విసిగినే విడిచినా విడువరు వీరేలోకులు |
కొసరేరు ముసరేరు కోరిక దీర్చుమనేరు | పసలేని పనులకు బడలనే నోపను ||
చ|| నుడుగుట దప్పినా నోము ఫల మిచ్చినట్లు | కడగి వేడుకొన్నాగానిమ్మనరు లోకులు |
తడవేరు తగిలేరు తామె శ్రీ వేంకటేశ | బుడి బుడి సంగతాలయబొరల నే నోపను ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం