సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పరమాత్ముడైన హరి
పల్లవి:

పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవు |
ధరమము విచారించ తగునీకు అమ్మ ||

చరణం:

కమలజుగన్న తల్లివి కామునిగన్న తల్లి |
అమరులగన్న తల్లి ఆదిమ లక్ష్మి |
విమలపు నీపతికి విన్నపము జేసి మమ్ము |
నెమకి ఏలితి దయ నీకే తగునమ్మ ||

చరణం:

కామధేను తోబుట్టుగ కల్పకము తోబుట్టుగ |
దోమటి చల్లిన చంద్రు తోబుట్టుగ |
నీమగని పంపునను నిజసిరులిచ్చితివి |
నేమపు వితరణము నీకే తగునమ్మ ||

చరణం:

పాలజలధి కన్యవు పద్మాసినివి నీవు |
పాలపండే శ్రీవేంకటపతి దేవివి |
ఏలిన యితని బంట్లకు యిహపరాలిచ్చి మా |
పాల గలిగితివి సంబంధము మేలమ్మ ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం