సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పరమాత్ముని నోరబాడుచును
టైటిల్: పరమాత్ముని నోరబాడుచును
పల్లవి:
ప|| పరమాత్ముని నోరబాడుచును యిరు- | దరులు గూడగదోసి దంచీ మాయ ||
చరణం:చ|| కొలదిబ్రహ్మాండపుకుందెనలోన | కులికి జీవులనుకొలుచు నించి |
కలికిదుర్మోహపురోకలి వేసి | తలచి తనవులను దంచీ మాయ ||
చ|| తొంగలిరెప్పలు రాత్రిబగలును | సంగడికనుగవ సరిదిప్పుచు |
చెంగలించి వెస జేతులు విసరుచు | దంగుడుబియ్యముగా దంచీ మాయ ||
చ|| అనయము దిరువేంకటాధీశ్వరుని | పనుపడి తనలో బాడుచును |
వొనరి విన్నాణిజీవులనియెడిబియ్యము | తనర నాతనికియ్య దంచీ మాయ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం