సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పరమజ్ఞానులకు
టైటిల్: పరమజ్ఞానులకు
పల్లవి:
ప|| పరమజ్ఞానులకు ప్రపన్నులకు | మరుగురుని మీద మనసుండవలదా ||
చరణం:చ|| ఆకలి గొన్నవానికి అన్నముపై నున్నట్లు | యేకత నుండవలదా యీశ్వరునిపైని |
కాకల విటుల చూపు కాంతలపై నున్నట్లు | తేకువ నుండవలదా దేవుని మీద ||
చ|| పసిబిడ్డలకు నాస పాల చంటిపై నున్నట్లు | కొసరి భక్తి వలదా గోవిందు పైని |
వెస తెరువరి తమి విడి తలపై నున్నట్లు | వసియించ వలదా శ్రీ వల్లభు మీదటను ||
చ|| నెప్పున ధనవంతుడు నిధి గాచి యుండునట్లు | తప్పక శ్రీ వేంకటేశు తగుల వద్దా |
అప్పనమైన భ్రమ ఆలజలాల కున్నట్లు | ఇప్పుడే వుండ వలదా ఈతని మీదను ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం