సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పరమపాతకుడ
టైటిల్: పరమపాతకుడ
పల్లవి:
ప|| పరమపాతకుడ భవబంధుడ శ్రీ- | హరి నిను దలచ నే నరుహుడనా ||
చరణం:చ|| అపవిత్రుడ నే నమంగళుడ గడు- | నపగతపుణ్యుడ నలసుడను |
కపటకలుష పరికరహృదయుడ నే- | నపవర్గమునకు నరుహుడనా ||
చ|| అతిదుష్టుడ నే నధికదూషితుడ | హతవివేకమతి నదయుడను |
ప్రతిలేనిరమాపతి మిము దలచలే- | నతులగతికి నే నరుహుడనా ||
చ|| అనుపమ విషయ పరాధీనుడ నే- | ననంత మోహభయాతురుడ |
వినుతింపగ తిరువేంకటేశ ఘను- | లనఘులుగాక నే నరుహుడనా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం