సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పరులకైతే నిదే
టైటిల్: పరులకైతే నిదే
పల్లవి:
ప|| పరులకైతే నిదే పాసముగాదా | పురిగొని నీవంక బుణ్యమాయగాక ||
చరణం:చ|| పరమపురుష నీవు పట్టినదే ధర్మము | అరసి నీవు చెల్లించినదే సత్యము |
ధరలోన నీరెంటికి తండ్రితో విరోధించగ | దొరసి ప్రహ్లాదునకు దోడైనదే గురుతు ||
చ|| నారాయణుడ నీవు నడపినదే తగవు | ఆరూఢి నీవౌనన్నదే ఆచారము |
సారెకు దమయన్నతో చండిపడి పెనగగ | కోరి సుగ్రీవు వహించుకొన్నదే గురుతు ||
చ|| శ్రీవేంకటేశ నీవు చేసినదే నీతి | చేవతో నీవొడబరచినదే మాట |
కావించి తాతతో బోరగా నీవు చక్రమెత్తి | ఆవేళ నడ్డమైనందుకు అర్జునుడే గురుతు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం