సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పరుసమొక్కటే కదా
టైటిల్: పరుసమొక్కటే కదా
పల్లవి:
ప|| పరుసమొక్కటే కదా పైడిగా జేసేది | అరయలోహ మెట్లున్నా అందుకేగాని ||
చరణం:చ|| వనజనాభుని భక్తి వదలకుండిన జాలు | మనసు యెందు తిరిగినా మఱియేమి |
మొనశి ముద్రలు భుజముల నుండితే చాలు | తనువెంత హేయమైన దానికేమి ||
చ|| శ్రీకాంతు నామము జిహ్వతగిలితే చాలు | ఏకులజుడైనను హీనమేమి |
సాకారుడైన హరి శరణుజొచ్చిన చాలు | చేకొని పాపము చేసిన నేమి ||
చ|| జీవు డెట్లున్న నేమి జీవునిలో యంతరాత్మ | శ్రీ వేంకటేశున కాచింత యేమి |
యేవల నంబరమైన యిహమైన మాకు చాలు | కైవశమాయె నతండు కడమ లింకేమి ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం