సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పరుసము సోకియు
టైటిల్: పరుసము సోకియు
పల్లవి:
ప|| పరుసము సోకియు బ్రదుకవద్దా | తిరిగి కర్మము లింక తీదీపులా ||
చరణం:చ|| పడిగాలువడియున్న ప్రాణాచారముల- | పడతుల నధముల బాలించితి |
యిడుమల బెడబాప నింకనేల తెగికొంత | గడిచీటిచ్చియు నింక గడమున్నదా ||
చ|| మితిలేనిధనములు మెరసి కానుకగొని | అతిపుణ్యులిందరి నలరించితి |
ధృతిహీనులకునెల్ల దిక్కయి కాతువుగాక | వ్రతముచెల్లిన నింక వట్టగట్లా ||
చ|| పాలించి నావిన్నపమున వేంకటరాయ | లాలించితివి నే నీలలనగానా |
యీలాగుననె లోకమింతా గాతువుగాక | పాలుదాగినమీద బైకుడుపులా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం