సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పసలేని యీబ్రదుకు
టైటిల్: పసలేని యీబ్రదుకు
పల్లవి:
ప|| పసలేని యీబ్రదుకు | ఆసలు చొచ్చిచొచ్చి అలసినట్టాయె ||
చరణం:చ|| తొల్లిటిజన్మాదుల గానినరరూపు | వల్లించుకొన్న యీబ్రదుకు |
కల్లసుఖములచే కనలి కమ్మర | ముల్లుదీసి కొర్రు మొత్తినట్టాయ ||
చ|| బూటకములనెల్ల బొరలి సంసారంపు- | పాటుదెచ్చిన యీబ్రదుకు |
నీటుగ నెద్దు దన్నీనని గుర్రము- | చాటుకేగిన యట్టిచందమాయె ||
చ|| పగగొన్న పొగకోపక మంట బడిపది | పగలు రేలైన బ్రదుకు |
తగువేంకటేశ్వరు దలచి నేలనుండి | యెగసి మేడమీద కేగినట్టాయె ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం