సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పట్టినదెల్లా
టైటిల్: పట్టినదెల్లా
పల్లవి:
ప|| పట్టినదెల్లా బ్రహ్మము | దట్టపుజడునికి దైవంబేలా ||
చరణం:చ|| ఘనయాచకునకు కనకమే బ్రహ్మము | తనువే బ్రహ్మము తరువలికి |
యెనయు గాముకున కింతులే బ్రహ్మము | తనలోవెలిగేటితత్త్వం బేలా ||
చ|| ఆకటివానికి నన్నమే బ్రహ్మము | లోకమే బ్రహ్మము లోలునికి |
కైకొని కర్మికి కాలమే బ్రహ్మము | శ్రీకాంతునిపై జింతది యేలా ||
చ|| భువి సంసారికి పుత్రులె బ్రహ్మము | నవ మిందరి కిది నడచేది |
యివలను శ్రీవేంకటేశుదాసులకు | భవ మతనికృపే బ్రహ్మము ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం