సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పట్టము గట్టితివింక
టైటిల్: పట్టము గట్టితివింక
పల్లవి:
ప|| పట్టము గట్టితివింక బ్రతుకరయ్యా | చిట్టకాలు లేవు మీకు శ్రీ వేంకటేశుడా ||
చరణం:చ|| అలమేలు మంగకు సింహాసనము నీవురము | కలిత హారములే సింగారపు దండలు |
తొలుత నీహస్తములే తోరణ గంభములు | చెలి రాజ్యమే నీవు శ్రీ వేంకటేశుడా ||
చ|| పరగు తులసీదండ పచ్చ తోరణమాపెకు | మెరుగు గౌస్తుభమణి మించుటద్దము |
గరిమ నీసొబగులు కప్పములు గానికలు | సిరులు నీ కూరిమలు శ్రీ వేంకటేశుడా ||
చ|| సంతతమైన విందులు సారె నీమోవి తేనెలు | వింత రతి భోగములు వినోదాలు |
కొంత నియ్యారును బొడ్డు కుంచెయు గాళాణి | చెంతలనన్నీ నమరె శ్రీ వేంకటేశుడా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం