సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: పట్టవసముగాని
టైటిల్: పట్టవసముగాని
పల్లవి:
ప|| పట్టవసముగాని బాలుడా పెను- | బట్టపుబలువుడ బాలుడా ||
చరణం:చ|| ఇరుగడ బ్రహ్మయు నీశ్వరుడును నిన్ను | సరుస నుతింప జఠరమున |
అరుదుగ నుండి ప్రియంబున వెడలిన- | పరమమూర్తివా బాలుడా ||
చ|| తల్లియు దండ్రియు దనియనిముదమున | వెల్లిగ లోలో వెరవగను |
కల్లనిదురలో గనుమూసుక రే- | పల్లెలో బెరిగిన బాలుడా ||
చ|| యేదెస జూచిన నిందరిభయముల- | సేదలు దేరగ జెలగుచును |
వేదపల్లవపు వేంకటగిరిపై | పాదము మోపిన బాలుడా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం